ఒకప్పుడు సినిమాలంటే కేవలం పౌరాణిక చిత్రాలు అన్నట్టుగా ఉండేది. కానీ కాలం మారిన కొద్దీ పౌరాణిక చిత్రాలు పోయి జానపద చిత్రాలు వచ్చాయి. అవి కూడా ఎంతో కాలం ప్రేక్షకులను రంజింప చేయలేకపోయాయి. తర్వాత ఇక సాంఘిక చిత్రాలే ప్రేక్షకుల మన్ననలను పొందుతూ అందులో రకరకాల జోనర్ లలో చిత్రాలు రావడం మనం గమనిస్తున్నాం.

కుటుంబం, ప్రేమ, సంగీతం, యాక్షన్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు రావడం మనం గమనిస్తున్నాం. రచయితలు, దర్శకనిర్మాతలు కూడా ఎప్పుడూ ఒకే మూస పద్ధతిలో వెళ్లకుండా కొత్త కథలతో ముందుకు వెళితే అంతే విధంగా ప్రేక్షకులు ఆదరిస్తారని కొత్త కథలతో కూడినసినిమాలు దర్శకులు తీస్తున్నారు.

కానీ కొన్ని సందర్భాల్లో అలాంటి కథలతో కూడిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. అలా 1991లో ఎస్. వి. కృష్ణారెడ్డి నిర్మాణ సారథ్యంలో, కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, నిరోషా హీరోహీరోయిన్లుగా కొబ్బరి బొండం అనే చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించకుండ కథ చిత్రానువాదం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ చిత్రంలో కొన్ని సీన్స్ లలో మరియు చల్లా.. చల్లని అనే పాట, గంగిగోవు లాంటి అనే రెండు పాటల్లో రాజేంద్ర ప్రసాద్ ఊబకాయంతో కనిపిస్తారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

అవును సినిమా లాంటి హారర్ చిత్రాలను తీసే దర్శకుడు రవిబాబు. తన పంథాను పూర్తిగా మార్చుకునని 2014లో రాజేంద్ర నిర్మాణ సారథ్యంలో రవిబాబు దర్శకత్వంలో అల్లరి నరేష్, పూర్ణ హీరోహీరోయిన్లుగా లడ్డు బాబు చిత్రం విడుదలైంది. ఇందులో భూమిక ఒక ప్రధాన పాత్ర పోషించింది. స్థూలకాయంతో కూడిన అల్లరి నరేష్ ను హీరోగా తీసుకొని దర్శకుడు రవిబాబు ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు. దాదాపు సినిమా మొత్తం అల్లరి నరేష్ పూర్తి ఊబకాయంతో కనిపిస్తారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని పొందింది.

2015 ప్రసాద్ నిర్మాణం లో కె.ప్రకాష్ దర్శకత్వంలో ఆర్య, అనుష్క, సోనాల్ చౌహాన్ హీరో, హీరోయిన్లుగా సైజ్ జీరో చిత్రంలో నటించారు. ఈ సినిమా తెలుగు తమిళంలో ఏక కాలంలో నిర్మించారు. ఒక హిందీ చిత్రం ఆధారం చేసుకుని దర్శకుడు ప్రకాష్ స్థూలకాయంతో కూడిన కథాంశాన్ని సైజ్ జీరో చిత్రం గా రూపొందించారు. కానీ ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇంతకుముందు దర్శకుడు కె.ప్రకాష్ నీతో, బొమ్మలాట, అనగనగా ఒకదీరుడు లాంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. మొత్తానికి స్థూలకాయం కథాంశంతో కూడిన ఏ చిత్రమైన బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here