గిరిబాబు రెండో కొడుకు కూడా సినిమా నటుడే అనే విషయం తెలుసా.?!

0
2184

ప్రకాశం జిల్లా రావినూతల గ్రామం లో పుట్టి పెరిగిన శేషగిరిరావుకు నాటకాలంటే ఎంతో ఇష్టం. ఆయన నటనపై ఇష్టంతోనే మద్రాస్ వెళ్లి సినిమా రంగంలో ప్రవేశించాడు. అలా 1973లో జగమే మాయ సినిమా ద్వారా సినిమాల్లోకి తెరంగేట్రం చేశాడు. 1977లో దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా మారారు. జయభేరి నిర్మాణ సంస్థలో మూడు నాలుగు సినిమాలు తీసినప్పటికీ దానిని హీరో మురళీమోహన్ కి అప్పగించడం జరిగింది.

ఆ తరువాత దక్షిణాది భాషల్లో 500 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించారు. అందులో దాదాపు 150 చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణవే ఉండడం ఒక విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అనేక సినిమాల్లో నటిస్తూ ఆయన తెలుగు ప్రేక్షకులను ఆనందింప చేశారు. నాటకాలు వేస్తున్న సమయంలోనే నాటకాలు ఎలా వేయాలి, ఏ పాత్ర ఎలా తీర్చిదిద్దాలి అనే అంశాలపై గిరిబాబు కు మంచి అవగాహన ఉండేది. ఆ క్రమంలో సినిమాలో విలన్ గా చేస్తున్న సమయంలోనే సినిమా నిర్మాణం, దర్శకత్వం వైపు తన ఆలోచన ధోరణి వెళుతూ ఉండేది. దర్శకుడిగా మారిన తర్వాత కౌబాయ్ చిత్రాలవైపు గిరి బాబు మొగ్గు చూపడం జరిగింది. ఆ క్రమంలో 1990 లో తన రెండో కొడుకు అయినా బోసు బాబు తో ఇంద్రజిత్ అనే సినిమాను నిర్మించడం జరిగింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని చవిచూసింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం తర్వాత కౌబాయ్ గా వచ్చిన ఏ చిత్రం కూడా దాదాపు హిట్ కాలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత గిరి బాబు మొదటి కొడుకు రఘు బాబు సినిమాల్లోకి రావడం జరిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా హాస్యనటుడిగా రఘు బాబు గిరిబాబు తర్వాత ఎక్కువగా సినిమాలలో నిలదొక్కుకోగలిగారు. అయితే బోసు బాబు హీరోగా నటించిన ఇంద్రజిత్ మూవీ పరాజయం పొందడంతో అప్పుడే నటుడు ప్రభాకర్ రెడ్డి టీవీ సీరియల్స్ చేస్తుండడంతో అటువైపు గిరిబాబు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత గిరిబాబు సినిమాల్లో హీరో,హీరోయిన్లకు కు తండ్రిగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆనందింప చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here