చెల్లెలి దర్శకత్వంలో తప్పకుండా నటిస్తా… శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు!

0
238

ప్రముఖ నటుడు,లోక నాయకుడిగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సినిమాలలో తన నటన ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ద్వారా మంచి విజయాలను అందుకున్న శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

శృతిహాసన్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు.నిత్యం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.

శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ దర్శక రంగంలో రాణించాలనేదే తన కోరిక అని తెలిపారు. ఈ సందర్భంలోనే తన చెల్లెలు దర్శకత్వం వహిస్తున్నప్పుడు తనకు సరిపడా కథను అందిస్తే తప్పకుండా నటిస్తానని శృతి హాసన్ ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా కరోనా కారణంతో వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఇంటికే పరిమితమైన శృతి హాసన్ తాజాగా అభిమానులతో ముచ్చటించి తన చెల్లెల దర్శకత్వంలో నటిస్తాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here