టాలీవుడ్ లో నయా వార్.. 50 మిలియన్ మార్క్ ని అవలీలాగా అందుకుంటున్న హీరోలు..!!

0
99

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది..హీరోల సినిమాల టీజర్ నుండి మొదలుకొని విడుదల వరకు ప్రతీ విషయంలో ఇప్పుడు ప్రతిదీ ట్రెండ్ అయిపోయింది.. గతంలో సినిమా రిలీజ్‌ తరువాత రికార్డ్స్‌ అన్న మాట వినిపించేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ నుంచే మొదలవుతోంది. ముఖ్యంగా ఫస్ట్ టీజర్‌ క్రియేట్ చేసే రికార్డ్స్‌తోనే సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా ఈ లిస్ట్‌లోకి పుష్పరాజ్‌ కూడా అడుగుపెట్టేశారు.అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ పుష్ప. సుకుమార్‌ డైరెక్టర్‌ చేస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్‌ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ వదిలారు. బన్నీ మేకోవర్‌, క్యారెక్టరైజేషన్‌ను కూడా ఈ టీజర్‌లోనే రివీల్ చేశారు. పాన్ ఇండియా సినిమా కూడా కావటంతో పుష్పరాజ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అయ్యింది.

అంతేకాదు వేగంగా 50 మిలియన్ల మార్క్‌ రీచ్‌ అయిన సౌత్ టీజర్‌గానూ రికార్డ్ సృష్టించింది పుష్ప. ఈ మధ్యే ఈ క్లబ్‌లోకి ఎంటర్‌ అయ్యారు ఎన్టీఆర్‌. ట్రిపులార్‌ కొమురం భీమ్ టీజర్‌ కూడా 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించ్చనున్నాడు. ఇక బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్నఅఖండ టీజర్‌ కూడా ఈ మార్క్‌ను రీచ్‌ అయ్యింది.

ఇటీవలే విడుదలైన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు..ఇక ఈ 50 మిలియన్ మార్క్ ను అందుకునే హీరోల లిస్ట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది..ఈ లిస్ట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా చేరే అవకాశం ఉంది..మరి ప్రభాస్ తన కొత్త సినిమా రాధే శ్యామ్ తో ముందు ముందు ఈ రికార్డ్ ని అందుకుంటాడేమో చూడాలి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here