ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. దాని వెనుకాల ఎంతో శ్రమదాగి ఉంటుంది. సినిమా షూటింగ్ సమయంలో పడే కష్టాలు.. ఇబ్బందులు వాళ్లకే తెలుస్తాయి. కథ దగ్గర నుంచి దానిని తెరమీద చూపించే విధానం వరకు అన్నీ కష్టంతో కూడకున్నదే. ఇంత శ్రమ పడి.. చివరకు సినిమా విడుదలైన సందర్భంగా కొన్ని వెబ్ సైట్లు కావాలనే బ్యాడ్ రివ్యూస్ ఇచ్చి.. సినిమాపై నెగెటివ్ ఫీలింగ్ తెప్పిస్తారు.

ఇలాంటిదే ఈ మధ్య విడుదలైన నాట్యం సినిమాకు జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సినిమా ప్రమోషన్ చేయాలంటే వారికంటూ ఓ పీఆర్ఓ ఉంటారు. ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్ దగ్గర నుంచి.. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే రివ్యూస్ వరకు అన్నీ అతడే చూసుకుంటాడు. ఇలా నాట్యం మూవీకి కూడా ఓ పీఆర్ఓను నియమించుకున్నారు.
దీనికి వంశీ-శేఖర్‌లు పీఆర్ఓగా పనిచేశారు. ప్రమోషన్ చేస్తామని ఇద్దరు కలిసి.. భారీగానే డబ్బులు వెనుకవేశారు. ఆ సినిమాకు సంబంధించిన వార్తలు ఎక్కడా రాకపోవడంతో.. ఇదేంటని సినిమా సభ్యులు వాళ్లని ప్రశ్నించారు. గొడవకు కూడా దిగారు. తాము చెప్పినట్లు అన్ని వెబ్ సైట్లు నడుచుకుంటాయని చెప్పడంతో.. వాళ్లు అడిగిన కాడికి ఇచ్చేశారు మేకర్స్. అయినా ఈ గొడవను మనస్సులో పెట్టుకున్నారు. వాళ్లను నమ్మించి.. సినిమా రిలీజ్ రోజున బ్యాడ్ రివ్యూస్ రాయించారు.
ఒక్క వెబ్ సైట్లో అంటే సరే అనుకోవచ్చు.. ప్రతీ సైట్లో ఇలానే వచ్చింది. దీనికి కారణం వీళ్లిద్దరే అని తెలుసుకున్న చిత్ర సభ్యులు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ యూనియన్, డైరెక్టర్స్ యూనియన్‌కు కంప్లైంట్ చేశాడు. ఎన్నో ఇబ్బందులను దాటుకొని.. నాలుగు సంవత్సరాలుగా ఎన్నో ఆశలతో విడుదల చేసిన ఈ సినిమాపై దుష్ప్రచారం చేయడంతో యువ దర్శకుడు రేవంత్ కోరుకొండ న్యాయపోరాటానికి దిగాడు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.































