దక్షిణాది అగ్ర కథానాయికగా ఎంతో పేరు సంపాదించుకున్న నటి త్రిష పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం త్రిషకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడం చేత తన కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, త్వరలోనే త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే త్రిష తమిళ స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని త్వరలోనే వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విధంగా త్రిష గురించి వస్తున్న వార్తలపై ఎట్టకేలకు నటి స్పందించారు. ఈ సందర్భంగా త్రిష టీమ్ మాట్లాడుతూ.. త్రిష పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. అవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం ఆమెకు తెలుగు, తమిళంలో పలు అవకాశాలు రావడంతో ఎంతో బిజీగా ఉన్నారని, ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని ఒకవేళ తనను పెళ్లి చేసుకోవాలని భావిస్తే తప్పకుండా ఆ విషయాన్ని అధికారికంగా తన అభిమానులతో పంచుకుంటూనని ఈ సందర్భంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ వాటన్నింటికీ పులిస్టాప్ పెట్టారు.
త్రిష తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించడమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. మధ్యలో కాస్త ఈమెకు అవకాశాలు తగ్గినప్పటికీ ప్రస్తుతం తమిళంలో అరడజనుకు పైగా సినిమా అవకాశాలను దక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.






























