ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలను అందుకుంటూ టాప్ పొజిషన్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారువారి పాట అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన మొట్ట మొదటిసారిగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది..ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది.

దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ఇటీవలే హైదరాబాద్ లో తదుపరి చిత్రీకరణను మొదలు పెట్టారు కానీ కరోనా మహమ్మారి తిరిగి విజృంభించడంతో షూటింగ్ కు బ్రేక్ వేశారు. దాంతో మహేష్ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే గడుపుతున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్.ఈ సినిమాను ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మహేష్ కెరియర్ లో 28వ సినిమా గా వస్తుంది ఈ మూవీ. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ మూవీ కోసం మహేష్కు బాగానే ముట్టజెపుతున్నారని తెలుస్తుంది. అయితే తాను నటించే సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ ప్రాఫిట్స్ షేర్ చేసుకునే మహేష్..

ఈ సినిమాకు కేవలం రెమ్యూనరేషన్ మాత్రనే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకోసం త్రివిక్రమ్ కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ సారి ఆయన పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా అందుకోనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి..మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ సినీ వర్గాల్లో ఈ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here