కరోనా కోరలు చాస్తున్న వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు, బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి ఆహరం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎందరో మహానుభావులు తమ శక్తి మేర సహాయం చేస్తున్నా ఇంకా ఎక్కడో ఒకచోట ఆహరం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఇటువంటి వారికోసం ఇప్పుడు వారికి సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎవరినీ ఆకలితో పస్తులుండనివ్వను అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఇప్పటికే అందరికి రేషన్ అందించారు.

ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇటువంటి వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు నిమిషాలలో వారికి ఆహారాన్ని అందించేలా చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా 040-21111111 అనే ఫోన్ నంబర్ ను కేటాయించింది. జిహెచ్ఎంసి పరిధిలో ఆహరం దొరక్క ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఫోన్ నంబర్ కు కాల్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here