TV Actress Harika: తెలుగు బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో నటుడు ఏక్ నాథ్, నటి హారిక ఒకరు. నేను శైలజ సీరియల్ ద్వారా పరిచయమైనటువంటి వీరిద్దరూ ఈ సీరియల్ ద్వారా స్నేహితులుగా మారీ అనంతరం ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇకపోతే ఈ దంపతులు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.

ఇకపోతే నవంబర్ 8వ తేదీ నటుడు ఏక్ నాథ్ పుట్టినరోజు కావడంతో హారిక తన భర్త పుట్టినరోజు వేడుకలను అరకులోయలో ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ విధంగా అరకులో అర్ధరాత్రి 12 గంటలకు తన భర్త చేత కేక్ కట్ చేయించి తనకు కొత్త దుస్తులతో పాటు ఖరీదైన కానుక కూడా ఇచ్చి తన భర్తను సర్ప్రైజ్ చేసింది. హారిక తన భర్తకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు అనే విషయానికి వస్తే…

TV Actress Harika: ఐఫోన్ కానుకగా ఇచ్చిన హారిక
ఈమె తన భర్త పుట్టినరోజు సందర్భంగా తనకు ఐఫోన్ 14 ప్రోమాక్స్ కానుకగా ఇచ్చారు. ఈ మొబైల్ ఫోన్ విలువ దాదాపు లక్షన్నర వరకు ఉంటుందని సమాచారం. ఇలా తనకు ఫోన్ కానుకగా ఇవ్వడంతో ఏక్ నాథ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇలా సీరియల్ ద్వారా ప్రేమలో పడిన వీరిద్దరూ 2020వ సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక తెలుగు బుల్లితెరపై పళ్ళు సీరియల్స్ లో సందడి చేస్తూనే మరోవైపు టీవీ షోస్, స్పెషల్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంటారు.
































