TV Serials: ప్రస్తుతం టాలీవుడ్ లో టీవీ సీరియల్స్ చూసే వారి సంఖ్య రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని చానల్స్ లో కలిసి దాదాపు 50 సీరియల్లకు పైగా ప్రసారం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం సీరియల్స్ లో కన్నడ నటీనటులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఏ సీరియల్ లో చూసిన కూడా ప్రధాన పాత్రలే కాకుండా ఒక మోస్తారు పాత్రలలో కూడా కన్నడ నటినటులే కనిపిస్తున్నారు.

ఇలా తెలుగు నటీనటులకు అవకాశాలు ఇవ్వకుండా కన్నడ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం గురించి బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సీరియల్స్ లో నటించిన విష్ణు ప్రియ ప్రస్తుతం జానకి కలగనలేదు, త్రినయిని సీరియల్స్ లో నటిస్తోంది. త్రినయిని హాసిని పాత్ర వల్ల విష్ణు ప్రియ బాగా ఫేమస్ అయ్యింది.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ తెలుగు సీరియల్స్ లో కన్నడ నటీనటులను తీసుకోవటానికి గల కారణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తెలుగు సీరియల్స్ లో కేవలం తెలుగువారిని మాత్రమే తీసుకోవాలంటే దాదాపు 500, 600 మంది నటీనటులు కావాలి. కానీ మనవాళ్ళు ఒక సీరియల్ చేయగానే రెమ్యునరేషన్ పెంచుతారు అంటూ చెప్పుకొచ్చింది.

TV Serials: లీడ్ రోల్ కావాలంటారు…
అలాగే మనవారు కేవలం లీడ్ రోల్ మాత్రమే చేస్తామని అంటారు. కానీ కన్నడ వాళ్ళు అలా కాదు. వాళ్లు ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు వేరే ప్రాజెక్ట్ చేయరు. అంతే కాకుండా కండీషన్లు పెట్టకుండా ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ కి వస్తారు. అలాగే ప్రేక్షకులు కూడా కొత్త లుక్ కోరుకుంటారు కదా… అందువల్ల దర్శకులు,నిర్మాతలు కూడా కన్నడ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలను కొంత మంది బుల్లితెర నటి నటులుతప్పు పడుతున్నప్పటికీ ఈమె చేసిన వ్యాఖ్యలలో నిజం ఉందని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































