Twinkle Khanna: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు ఎంతోమంది దర్శక నిర్మాతల మనోభావాలను కించపరచకుండా వారీ ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇలా ఎంతో మంది దర్శక నిర్మాతలు చెప్పిన మాటలను కాదనకుండా ఇండస్ట్రీలో కొనసాగడం కోసం మనసు చంపుకొని కొన్ని సీన్లలో నటిస్తూ ఉంటారు. మరి కొంత మంది ఎదిరించి ఇండస్ట్రీ నుంచి బయటకు వస్తుంటారు.

ఇకపోతే ఇలాంటి అనుభవాలు సాధారణ సెలబ్రిటీలకు మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీలకు కూడా ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఇలా తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ కన్నా.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఒక డైరెక్టర్ తనతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించారని వెల్లడించారు.
ఒకరోజు సినిమా షూటింగ్ లోకేషన్ లో ఉండగా ఆ సినిమా దర్శకుడు హీరో హీరోయిన్ల మధ్య ఒక రైన్ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది ఇందుకోసం ఈమె తెలుపు రంగు దుస్తులను ధరించి ఉన్నారు.అయితే ఆ సమయంలో డైరెక్టర్ ఆమె వద్దకు వెళ్లి తనకు శాలువా కప్పి నేను ఇప్పుడు మందాకిని పాత్ర చేయమంటే నువ్వేం చేస్తావని అడగగా ముందుగా నో అని సమాధానం చెబుతాను. ఆ తర్వాత నువ్వు రాజ్ కపూర్ వి కాదు అంటూ సమాధానం చెబుతానని చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఆ డైరెక్టర్ సినిమాలో నాకు చాన్స్ ఇవ్వలేదు…
రాజ్ కపూర్ దర్శకత్వంలో రామ్ తేరీ గంగా మైలీ సినిమాలో నటించిన హీరోయిన్ మందాకిని ఈమె ఈ సినిమాలో బిడ్డకు పాలిచ్చే సన్నివేశాలలోనూ అలాగే తన పార్ట్స్ కనిపించే విధంగా పలుచని చీరలో స్నానం చేస్తూ సందడి చేశారు. ఇలా మందాకిని తరహాలో తను కూడా తన ప్రైవేటు పార్ట్స్ కనిపించేలా దుస్తులు వేసుకోమని పరోక్షంగా చెప్పారు. దీంతో తాను నో అని సమాధానం చెప్పడంతో ఆ డైరెక్టర్ తనతో మాట్లాడక పోవటమే కాకుండా,అనంతరం తన సినిమాలో కూడా అవకాశాలు ఇవ్వలేదంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.



























