వివాహిత స్నానం చేస్తుండా వీడియో తీశాడు.. ఆ వీడియోని అడ్డుపెట్టుకుని ఏం చేశారంటే?

0
212

చట్టాలు ఎన్ని చేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి మహిళ బయట అడుగుపెట్టిందంటే.. తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోంది. ఏం జరిగి ఉంటుందో అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. అమ్మాయి అయితే చాలు ఎలాంటి వాయి వరుసలు గుర్తుకురావు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళకు బయటనే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా.. వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటిదే మరో ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణంలోని ప్రశాంత్ నగర్ లో ఓ వివాహిత నివాసం ఉంటుంది.

ఆమెపై ఇద్దరు అన్నాదమ్ముళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై ఖమ్మంలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె స్నానం చేస్తుండగా.. ప్రవీణ్ అనే యువకుడు ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటితో ఆమెను బెదిరించాడు.

తన కామ కోరిక తీర్చాలని ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రవీణ్ సోదరుడు గిరిదర్ కూడా ఆమెను ఇలానే బెదిరించడం మొదలుపెట్టాడు. వాళ్లు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆమె తనపై వారిద్దరు లైంగిక దాడి చేసి.. వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here