YS Jagan: ఏపీ ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలు అయ్యారు. జగన్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాకి పోను మూడు సంవత్సరాల కాలంలో అద్భుతమైన పరిపాలన అందించారు. కొత్తగా ఎన్నో కాలేజీలు నాడు నేడు కింద స్కూల్స్ హాస్పిటల్ రూపురేఖలు మార్చేశారు.

ఇక ప్రతి ఒక్క సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందించారు. ఇలా ఈ స్థాయిలో సంక్షేమం అందించడంతో ఈ ఎన్నికలలో కూడా తామే విజయం సాధిస్తామని వై నాట్ 175 అంటూ పిలుపునిచ్చారు. కానీ ఎన్నికలలో మాత్రం కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు.
ఇలా జగన్ ఘోరంగా ఓటమిపాలు కావడానికి గల కారణాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జగన్ ఇంత అద్భుతమైన పరిపాలన అందించినప్పటికీ ఓడిపోవడానికి కారణం ఎలాంటి బ్రాండ్లు లేకుండా మద్యం అమ్మడమేనని తెలిపారు. తక్కువ క్వాలిటీతో చీఫ్ లిక్కర్ అమ్మటం అనేది ఆయన విజయం పై పెద్ద దెబ్బ పడిందని ఈయన వెల్లడించారు.
ఆంధ్ర హక్కులు సాధించాలి..
ఇక జగన్ ఓడిపోయారని ఎవరు తనని తక్కువ అంచనా వేయొద్దు ఆయనకు 40% ఓటింగ్ శాతం ఉందని అరుణ్ కుమార్ వెల్లడించారు.అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే హక్కు ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రకు రావలసిన ప్రత్యేక హోదా పోలవరం విశాఖ ఉక్కు వంటి వాటిని కేంద్రం నుంచి డిమాండ్ చేసి రాష్ట్రానికి తీసుకురావాలని ఈయన కోరారు.





























