Undavalli Sridevi : బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన ఆరోపణల మీద కౌంటర్ ఇచ్చిన ఉండవల్లి శ్రీదేవి… 80 కోట్ల ఇల్లా అది అంటూ…!

0
349

Undavalli Sridevi : బోరుగడ్డ అనిల్ కుమార్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఆమె అరటిపళ్ళు అమ్ముకునే వ్యక్తిని కూడా దోచుకుంది అంటూ ఆరోపించారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి క్రాస్ ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి మీద ఆరోపణలు వినిపించడంతో వైసీపీ నుండి ఆమెను సస్పెండ్ చేసారు. ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ బోరుగడ్డ అనిల్ ఆమె ఎమ్మెల్యే అవ్వక ముందు చిన్న ఇంట్లో ఉండేదని, ఎమ్మెల్యే అవ్వగానే 80 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంది అంటూ విమర్శలను గుప్పించారు. అయితే ఈ విమర్శల మీద ఉండవల్లి శ్రీదేవి ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు. తాను క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు.

80 కోట్ల ఇల్లా అది… నా గురించి లేనిపోనివి చెబుతున్నారు…

ఉండవల్లి శ్రీదేవి గారు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసి క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పార్టీ నుండి జగన్ సస్పెండ్ చేయగా శ్రీదేవి తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అయిన మొదటి రోజునుండి అవినీతికి నేను వ్యతిరేకిని కాబట్టి, నన్ను బినామీగా పెట్టుకోలేరు కాబట్టి నన్ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా తప్పించాలని చూసారు. నేను అన్నీ ఓర్చుకుంటూనే వస్తున్న చివరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ ను బూచిగా చూపి నన్ను బయటకు పంపారు. జగన్ మంచి వ్యక్తి అయినా ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు తప్పుడు సూచనలు ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ చెప్పారు.

ఇక హైదరాబాద్ లో ఉన్న ఇల్లు 80 కోట్లు 100 కోట్లు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళే చూసారు కదా ఆ ఇల్లు అన్ని కోట్ల విలువ చేస్తుందా.. అయినా ఆ ఇంటిని మేము 2016లో కొనుగోలు చేసాము. నిజాలు బయటికి రావు, నా మీద అవినీతి ఆరోపణలను చేసి స్లో పాయిజన్ లాగా వాటిని జనాల్లోకి మీడియాకు ఎక్కిస్తున్నారు కొంతంది పెయిడ్ బ్యాచ్ అంటూ ఆరోపించారు. నన్ను ఎలాగైనా బయటికి తోసేయాలని అనుకున్నారు అందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వాడుకున్నారు అంటూ చెప్పారు శ్రీదేవి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా భూటకం అంటూ విమర్శించారు.