UNESCO: హిందీ మన జాతీయ భాష అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు మన భారదేశంలో ఉన్న చాలామంది సగానికి పైగా హిందీ భాషను మాట్లాడుతుంటారు. మన భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా హిందీ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు.

తాజాగా హిందీ భాషకు అరదైన గౌరవం దక్కింది. యూనెస్కో (UNESCO ) ప్రపంచ వారసత్వ కేంద్రం వెబ్‌సైట్‌లో హిందీ భాషను ప్రచురించడానికి అంగీకరించినట్లు కేంద్రం తెలిపింది. ఇటీవల జాతీయ హిందీ దినోత్సం జరుపుకున్న నేపథ్యంలో యూనెస్కో ప్రధాన కేంద్రం అయిన పారిక్ కు చెందిన భారతదేశ శాశ్వత ప్రతినిధి విశాల్ వీ శర్మ బృందం ఓ వేడుకను నిర్వహించింది.

ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి తెలుసుకొనుటకు ఇక నుంచి హిందీ భాషలో కూడా వివరించేందుకు WHC(వరల్డ్ హెరిటేజ్ సెంటర్) వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి అంగీకరించరించినట్లు ప్రతినిధి బృందం తెలియజేసింది.
సాంస్కృతిక లేదా సహజ వారసత్వానికి సంబంధించిన …
యూనెస్కో తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు.. కేంద్ర విద్య , నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇక యూనెస్కో విషయానికి వస్తే.. దీనిని 1945లో స్థాపించారు. దీనిలో సాంస్కృతిక లేదా సహజ వారసత్వానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు దీనిలో లిస్ట్ అయి ఉంటాయి. భారతదేశం 1977లో యునెస్కో సమావేశాన్ని ఆమోదించింది. దీంతో మొదటగా దీనిలో అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, తాజ్ మహల్ మరియు ఆగ్రా కోట వంటివి భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇండియా నుంచి మొత్తం 40కి పైగా వారసత్వ ప్రదేశాలు చోటు సంపాదించాయి.
On the occassion of World Hindi Day, World Heritage Centre has agreed to publish Hindi descriptions of India's UNESCO World Heritage Sites on WHC website. @VishalVSharma7 @HarshShringla @IndianDiplomacy @PMOIndia @DrSJaishankar @M_Lekhi pic.twitter.com/CUeXS3S2St
— India at UNESCO (@IndiaatUNESCO) January 10, 2022