Union Minister Kishan Reddy : ఆ వ్యక్తి వల్లే కర్ణాటకలో దెబ్బతిన్నాం…: మంత్రి కిషన్ రెడ్డి

0
123

Union Minister Kishan Reddy : దేశంలో కాంగ్రెస్ ను పారద్రోలాలి అనే నినాదంతో బీజేపీ దేశ ఎన్నికలకు వెళ్ళింది. చాలా చోట్ల కంచుకోటల్లాంటి చోట కూడా కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అలానే తన మిత్ర పక్షాల ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ మళ్ళీ దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ తాజా సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపింది. రాహుల్ గాంధీ జోడో భారత్ యాత్ర ఫలితమే కర్ణాటక కాంగ్రెస్ విజయం అంటూ చాలా మంది విశ్లేశిస్తున్నా బీజేపీ ఓడిపోడానికి కారణాలు ఇవి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తాజాగా పేర్కొన్నారు.

ఓడిపోడానికి కారణాలు ఇవే…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ గెలవడానికి కారణాలు అక్కడి స్థానిక బీజేపీ నాయకత్వం అంటూ చెప్పారు. యాడ్యూరప్ప వల్ల పార్టీకి డామేజే అయిందని అలాగే ప్రభుత్వం పని చేయడంలో కూడా సమన్వయ లోపం ఉండటం వల్ల ఒడిపోయామని తెలిపారు.

ఇక అవినీతి కూడా ఒక కారణం ఆంటూ ఓపెన్ గా చెప్పేసారు కిషన్ రెడ్డి. నిజానికి కాంగ్రెస్ ప్రచారాల్లో కూడా బీజేపీ అవినీతి గురించి గట్టిగా మాట్లాడటం వల్లే కాంగ్రెస్ గెలిచింది. తమ పార్టీ నేతలే అయినా కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా అక్కడి ప్రభుత్వ అవినీతి గురించి చెప్పేసారు.