Unni Mukundan: ప్రముఖ మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కేవలం మలయాళ చిత్రాలలో మాత్రమే కాకుండా తమిళం తెలుగు భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఈయన ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతూనే వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.

2018 వ సంవత్సరంలో కొట్టాయం టౌన్‌కు చెందిన ఓ యువతి నటుడు ఉన్ని ముకుందన్ సినిమా స్టోరీ చెబుతానంటూ తనని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఆ యువతి ఫిర్యాదు చేయడంతో 2018 సెప్టెంబర్ 15వ తేదీన కేసు నమోదు చేసుకున్న అనంతరం నటుడు ఉన్ని ముకుందన్ ను కోర్టులో కూడా హాజరు పరిచారు.
ప్రముఖ న్యాయవాది సైబీ జోస్ కిడంగూర్ ఉన్ని తరపున కేసును వాదించారు. యువతితో రాజీ చేసుకున్నట్లు కోర్టుకు ఓ పత్రం చూపించడంతో కోర్టు ఈ కేసును కొట్టివేసింది.ఇలా కోర్టు ఈ కేసు కొట్టి వేయడంతో ఉన్ని స్టే ఆర్డర్ పై ఉంటున్నారు. అయితే, జోస్ కిడంగూర్ కోర్టుకు చూపించిన పత్రంపై తాను సంతకంచేయలేదంటూ ఆ యువతి కేరళ హైకోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

Unni Mukundan: స్టే ఆర్డర్ విత్ డ్రా చేసిన కోర్టు…
ఇలా ఆ యువతి తాను ఎలాంటి సంతకం చేయలేదంటూ వాంగ్మూలం ఇవ్వడంతో కేరళ హైకోర్టు నటుడు ఉన్ని ముకుందన్ కు చిన్న జలక్ ఇచ్చింది. దీంతో కోర్టు సైబీ జోస్ కిడంగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిన తప్పుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించడమే కాకుండా ఉన్ని ముకుందన్ పై ఉన్నటువంటి స్టే ఆర్డర్ విత్ డ్రా చేసుకుంది. ఇలా ఈ కేస్ తిరిగి మళ్లీ మొదటికే వచ్చిందని చెప్పాలి.


























