Unstoppable 2: ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. గతంలో నిర్వహించిన అన్ స్టాపబుల్ సీజన్ వన్ లో హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ.. సెలెబ్రిటీలు సిల్లీ ప్రశ్నలు అడుగుతూ మరింత హుషారుగా సందడి చేస్తున్నాడు. ఈ షోలో బాలయ్య చేసే సందడి ఈ షో కి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఇప్పటికి ఎంతోమంది సెలబ్రిటీలో పాల్గొని సందడి చేశారు.

ఈ సీజన్ 2 లో సినిమా సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా పాల్గొని సందడి చేశారు. అన్ స్టాపబుల్ సీజన్ టు మొదటి ఎపిసోడ్ లోనే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనటంతో ఈ షో రేటింగ్స్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవల పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈ షో లో గెస్ట్ గా రావటంతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేసిన తర్వాత యూజర్స్ ధాటికి తట్టుకోలేక ఆహా సర్వర్ డౌన్ అయిపోయిందంటేనే చెప్పవచ్చు. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేశారో.
ప్రభాస్ ఎపిసోడ్ తో అత్యధిక రేటింగ్స్ తో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 లో మరొక స్టార్ హీరో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 2 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు యంగ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ కేటీఆర్ కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

Unstoppable 2: సంతోషంలో మెగా ఫ్యాన్స్…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇలా స్టార్ హీరోతో పాటు పొలిటికల్ లీడర్ కూడా ఈ షో కి హాజరైతే అటు సినిమా, ఇటు పాలిటిక్స్.. రెండింటిని బాలయ్య ఏ రేంజ్ లో బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ షో కి హజరవటంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ షో కి హాజరు కానున్నాడు అనే వార్త తెలియటంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

































