అన్ స్టాపబుల్.. నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తూ కొనసాగుతోంది. అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ఓటీటీ టాక్ షో ఇటీవలే ప్రారంభమై అభిమానుల్ని అలరిస్తోంది. బాలయ్య బాబు హోస్టింగ్ అదిరిపోవడంతో రెండు ఎపిసోడ్లకు భారీగా రెస్పాన్స్ వచ్చేసింది. ఈ షో తొలి ఎపిసోడ్‌కు మోహన్‌బాబుతో పాటు ఆయన కుమార్తె లక్ష్మి, కుమారుడు విష్ణు వచ్చి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు.. మంచు ఫ్యామిలీ ఆసక్తికర సమాధానాలిచ్చారు. రెండో ఎపిసోడ్లో నేచురల్ స్టార్ నాని వచ్చి సందడి చేశారు.

బాలయ్యతో కలిసి క్రికెట్ కూడా ఆడారు. ఈ రెండు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. బాలయ్య బాబు పంచ్ లు, నాని జోక్ లతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకొంది. ఇక ఈ రెండు ఎపిసోడ్స్ తో ఈ షో పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. అటు ఎమ్మెల్యేగా .. ఇటు హీరోగా.. మరో వైపు బుల్లితెరపై తన సత్తా చాటుతున్నారు.
రీల్ లైఫ్ లో మాత్రమే కాదు అతడు రియల్ లైఫ్ కూడా అయన హీరోనే. ఇక బసవతారకం ఆసుపత్రిని ఎంతో బాధ్యతగా ముందుకు నడిపిస్తున్నాడు. కొన్ని వేల కుటుంబాలకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే ఓ పాప క్యాన్సర్ వ్యాధితో హాస్పిటల్ లోకి చేరింది. ఆమె ఆపరేషన్ కు రూ.7లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్లు. దీంతో వాళ్లు ఆ ఆపరేషన్ కోసం రూ.1.80లక్షల వరకు విరాళాలు సేకరించారు. కానీ ఇంకా ఆమె ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి.
దీంతో వాళ్లు దిక్కుతొచని పరిస్థితులో ఉండగా.. బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిశారు. తమ పరిస్థిని వాళ్లు అతడికి వివరించగా.. అతడు బాలయ్య వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. అంతే ఇక .. ఏమాత్రం ఆలోచించకుండా బాలయ్య మిగిలిన డబ్బును సమకూర్చి వాళ్లకు ఇచ్చాడు. తర్వాత ఆ పాప కోలుకుంది. అదే చిన్నారి ఈ షోలో ప్రత్యక్షమవ్వడంతో బాలయ్య ఎమోషనల్ అయ్యాడు. నాని అలా బాలయ్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
































