Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇదివరకు సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. తనలో ఈ యాంగిల్ కూడా ఉందంటూ అన్ స్టాఫబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమం ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ హీరోలను ఆహ్వానించి వారిని బాలయ్య తన స్టైల్ లో ప్రశ్నిస్తూ ఎన్నో సమాధానాలను రాబట్టారు. నటుడిగా వ్యాఖ్యతగా బాలయ్య ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి అయినటువంటి ఈ కార్యక్రమం మూడవ సీజన్ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ కార్యక్రమ 3 వ సీజన్ ఎప్పుడు ప్రసారమవుతుంది అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రసారం కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం మరింత ఆలస్యం కావడానికి ఏ కారణం లేదు బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమం ఆలస్యమైందని తెలుస్తుంది.

Unstoppable: అతిథులుగా యూట్యూబ్ స్టార్స్…
ఈ కార్యక్రమం నవంబర్ మొదటివారం లేదా చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసారి ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా యూట్యూబ్ స్టార్స్ కూడా రాబోతున్నట్టు సమాచారం.అయితే ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలకు హాజరుకాకుండా మొహం చాటేస్తూ ఉన్నటువంటి సెలబ్రిటీలను బాలయ్య ఈ కార్యక్రమానికి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.