Unstoppable 4: నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు హీరోగా ప్రేక్షకులను మెప్పించారు అయితే ఈయన మొదటిసారి వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఆహాలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇప్పటికే మూడు సీజన్లో పూర్తీ అయ్యాయి ఈ మూడు సీజన్లో కూడా ఎంతో మంచి ఆదరణ పొందాయి ఈ కార్యక్రమానికి కేవలం సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులూ కూడా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఇలా వారందరిని బాలయ్య వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు.
మూడు సీజన్లు కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో మరొక సీజన్ ప్రారంభించడానికి ఆహా సిద్ధమైనది. ఈ క్రమంలోనే నాలుగవ సీజన్ కి సంబంధించిన పోస్టర్ ను అధికారకంగా విడుదల చేశారు. ఇలా ఈ కార్యక్రమం నాలుగవ సీజన్ ప్రారంభం కాబోతుందని తెలిసే బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల తరువాతే..
ఇక నాలుగవ సీజన్లో భాగంగా ఈ కార్యక్రమానికి ఎవరెవరు రాబోతున్నారనే విషయం గురించి కూడా అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సీజన్ ఎన్నికల తర్వాతనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఈయన రాజకీయాల పరంగా బిజీగా ఉన్నారు ఎలక్షన్ల తర్వాతనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.



























