ముంబై: బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ తన డెయిరింగ్ ఫ్యాషన్ ఎంపికలతో తరచూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ప్రత్యేకించి తన డ్రెస్ సెలెక్షన్, వేరియేషన్స్‌తో నెటిజన్ల దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ వస్తోంది.

లిప్ ఫిల్లర్స్ తొలగింపు: శారీరక, మానసిక ప్రభావం
తాజాగా ఉర్ఫీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన డ్రెస్సింగ్ వల్ల కాదు.. తన లిప్ ఫిల్లర్ల విషయమై. గతంలో ఆమె పెదవులకు ఫిల్లర్లు వేయించుకుంది. ఇప్పుడు వాటిని తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయం, దాని వల్ల ఎదురైన ఫిజికల్ & ఎమోషనల్ ఇంపాక్ట్‌ను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. ఫిల్లర్లు తొలగించే ముందు, తర్వాత తన ముఖం ఎలా మారిందో తెలిపే వీడియోలు, ఫోటోలను షేర్ చేసింది. ఇవి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఉర్ఫీ చెప్పిన వివరాల ప్రకారం.. తాను 18ఏళ్ల వయసులో లిప్ ఫిల్లర్స్ వేయించుకుంది. కానీ 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు అవి సరిగా లేవనిపించడంతో తీసేయాలని డిసైడ్ అయ్యింది. ఈ ప్రక్రియ చాలా బాధాకరంగా అనిపించిందని చెప్పింది. ఫిల్లర్స్ తొలగించగానే ముఖం వాచిపోయిందని పేర్కొంది. ‘‘ఈ వీడియో మీ స్వంత రిస్క్‌తో చూడండి’’ అంటూ ఓ హెచ్చరిక కూడా పెట్టింది. నవ్వినప్పుడు వచ్చే లైన్స్ (లాఫ్ లైన్స్), పెదవుల పైభాగంలో ఉన్న ఫిల్లర్లు తొలగించుకున్నట్లు వివరించింది.
పూర్తిగా గుడ్ బై చెప్పలేదు: నిపుణుల సలహా
అయితే, ఫిల్లర్లకు పూర్తిగా గుడ్ బై చెప్పలేదని స్పష్టం చేసింది. “నేను ఫిల్లర్స్‌ను పూర్తిగా వదిలేయనంట. 2-3 వారాల తర్వాత మళ్లీ సహజమైన స్టైల్లో చేయించుకుంటాను. కరిగించుకోవడం చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ. అందుకే మంచి డాక్టర్‌ను ఎంచుకోవడం తప్పనిసరి. ఫ్యాన్సీ క్లినిక్‌లకు వెళ్లొద్దు.. వాళ్లకు ఏమీ తెలియదు” అంటూ సలహా కూడా ఇచ్చింది. ఈ చికిత్సను ముంబయిలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ ‘డాక్టర్ రిక్సన్’ వద్ద చేయించుకున్నట్లు తెలిపింది.
నెటిజన్ల స్పందన: ధైర్యం vs ట్రోల్స్
ప్రస్తుతం ఆమె ముఖం ఉబ్బిపోయిన వీడియోలు వైరల్ అవుతున్నా.. ఉర్ఫీ ధైర్యంగా తీసుకున్న ఈ నిర్ణయం, తన అనుభవాన్ని ఓపెన్గా పంచుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు కొంతమంది మాత్రం ఆమెపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయినా తన నిర్ణయంపై నిశ్చయంగా ఉండడం, ఒపెన్‌గా మాట్లాడటం ఉర్ఫీ స్టైల్‌నే చెప్పాలి.
उर्फी जावेद ने 9 साल बाद हटावाए लिप फिलर
— Khushbu (@sumankumari_143) July 20, 2025
ट्रीटमेंट का वीडियो देखो pic.twitter.com/J9bViyHn8M
































