Yogi Adithyaath: సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి.. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని..!

0
416

Yogi Adithyaath: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌పై విరుచుకుపడుతూ.. ఎస్పీ ప్రభుత్వంలో రాష్ట్రం అల్లకల్లోంలా మారిందని అన్నారు. అల్లర్లు జరుగుతున్న క్రమంలో మతాలు, జాతుల వ్యవహారంతో గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయన్నారు.

Yogi Adithyaath: సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి.. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని..!
Yogi Adithyaath: సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి.. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని..!

ఎన్నో వర్గాల ప్రజలు నష్టపోయారన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అల్లర్లు లేని రాష్ట్రంగా మార్చామని చెప్పుకొచ్చాడు. హిందువుల ఇల్లు తగులబడితే ముస్లింల ఇంటికి ఎలా భద్రత ఉంటుందని.. హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని సీఎం అన్నారు.

Yogi Adithyaath: సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి.. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని..!
Yogi Adithyaath: సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి.. హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు సురక్షితంగా ఉంటారని..!

మన ప్రభుత్వ హయాంలో ఇలాంటి అల్లర్లకు తావు లేకుండా చేశామని యోగి పేర్కొన్నాడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అయోధ్య-కాశీ తర్వాత మధుర అనే ప్రశ్నపై సీఎం యోగి మాట్లాడుతూ.. దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతదేశం, భారతీయత గురించి మనం గర్వించగల వాటిలో ఇది ఒక భాగం. దీనిలో మధుర కూడా చేస్తామన్నారు.

ఈ ఎన్నికలో ఎస్పీ కేవలం మూడు సీట్లు మత్రమే ..

అప్పట్లో రామమందిర నిర్మాణంపై తీర్పు వస్తే.. ఇక్కడ అల్లర్లు విపరీతంగా జరిగేవి అని.. రక్తపు నదులు ప్రవహిస్తాయని చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే రామ మందిర నిర్మాణంలో మనం పురోగతి సాధించామని.. ఈ మార్పును ప్రజలు చూస్తున్నారని అన్నాడు. జాతీయవాదమే మా ఎజెండా అని.. రామ మందిరం సాంస్కృతిక జాతీయవాదంలో భాగం అని అన్నాడు. పుణ్యభూమిని దైవంగా, గొప్పగా మార్చడం మన జాతీయవాదంలో భాగం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఎన్నికలో ఎస్పీ కేవలం మూడు సీట్లు మత్రమే వస్తాయిని.. మిగిలిన 400 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. రాముడు, కృష్ణుడిపై నమ్మకం లేని వారు ఏ నోటి నుంచి నేడు రాముడు, కృష్ణుడు అనే పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించాడు.