Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లయిన పది సంవత్సరాలకు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ దంపతులు పెళ్లి తర్వాత 10 సంవత్సరాలకు బిడ్డకు జన్మనిచ్చారు జూన్ 20వ తేదీ ఉపాసన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో డెలివరీ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా ఉపాసన బిడ్డకు జన్మనివ్వడంతో మెగా వారసురాలిని చూడడం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఉపవాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈమె ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఉపాసన విదేశాలలోనే డెలివరీ అవుతారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఉపాసన కొట్టి పారేశారు.
తాను అపోలో హాస్పిటల్లోనే డెలివరీ కాబోతున్నానని విషయాన్ని ప్రకటించారు. ఇలా తన సొంత హాస్పిటల్ లోనే ఉపాసన బిడ్డకు జన్మనిచ్చారు.ఉపాసన అపోలో హాస్పిటల్స్ కు ఎక్సిక్యూటివ్ చైర్పర్సన్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే తన సొంత హాస్పిటల్ లోనే ఉపాసన డెలివరీ అయినప్పటికీ పెద్ద ఎత్తున ఈమె బిల్లు పే చేశారని తెలుస్తుంది.

Upasana: బిల్ పే చేసిన రామ్ చరణ్…
సొంత హాస్పిటల్ లో ఉపాసన బిల్ కట్టడం ఏంటి అనే విషయానికి వస్తే… ఉపాసన డెలివరీ సమయంలో విదేశాల నుంచి కొందరు స్పెషలిస్టులు ఇండియా వచ్చారట అలాగే కొన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగిందని తెలుస్తోంది. వీటికోసం సుమారు కోటిన్నర రూపాయల వరకు ఖర్చు అయిందని, ఆ ఖర్చు మొత్తం రామ్ చరణ్ పే చేసారని తెలుస్తోంది. ఈ విధంగా ఉపాసన డెలివరీ కోసం 1.5 కోట్ల రూపాయలు రామ్ చరణ్ చెల్లించారట.
































