Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె ప్రస్తుతం ఏడవ నెల గర్భిణీ. మరి కొద్ది రోజులలో మెగా కుటుంబంలోకి బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారు. ఇలా బుల్లి రామ్ చరణ్ లేదా ఉపాసన రాక కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

ఇక ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటికీ తన భర్తతో కలిసి పలు వెకేషన్ లకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ ఉపాసన దుబాయ్ వెకేషన్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇలా దుబాయ్ వెకేషన్ లో తన స్నేహితులు కజిన్ తో కలిసి రాంచరణ్ ఉపాసన ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక దుబాయ్ వెకేషన్ లో భాగంగా తన కజిన్స్ తనకు బేబీ షవర్ వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో ఉపాసన రాంచరణ్ తెలుపు రంగు దుస్తులు ధరించి కనిపించారు. అయితే ఈ బేబీ షవర్ ఫంక్షన్లో ఉపాసన ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.

Upasana: లక్షల విలువ చేస్తున్న ఉపాసన డ్రెస్…
తెలుపు రంగు లేస్ లాంగ్ ఫ్రాక్ ధరించినటువంటి ఉపాసన ఈ డ్రెస్సులో తన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇక ఈ వేడుకలో ఉపాసన ధరించిన ఈ డ్రెస్ ఆస్ట్రేలియన్ బ్రాండ్ జిమ్మెర్‌మాన్ ద్వారా లారెల్ బ్రోడెరీ ఆంగ్లైస్ మిడి డ్రెస్ ధర రూ. 1,55,568 అని తెలుస్తుంది. ఇలా ఈ డ్రెస్ ఏకంగా 1.5 లక్షల రూపాయలు అని తెలియడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































