Upasana: మెగా కోడలు ఉపాసన చినమామయ్య పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఏకంగా ఐదు కోట్ల రూపాయలు విరామం ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించడమే కాకుండా మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన పార్టీని ఈసారి టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.

ఇలా కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి 21 అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన పార్టీ కార్యకలాపాల కోసం భారీ స్థాయిలో డబ్బు ఖర్చవుతున్నటువంటి తరుణంలో గతంలో పవన్ కళ్యాణ్ విరాళాలను కూడా సేకరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన సైతం పవన్ కళ్యాణ్ ని కలిసి ఐదు కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా అందించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిజమేనా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
జనసేనకు విరాళం..
ఉపాసన మెగా కోడలు కావడంతో ఆమె బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించారు ఈ క్రమంలోనే తాను జనసేన పార్టీకి విరాళంగా డబ్బు ఇచ్చారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి తప్ప ఆమె ఎలాంటి విరాళం కూడా అందించలేదని తెలుస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు తన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానూ రాజకీయాలలోకి రావడం తనకు ఇష్టం లేదని అందుకే తన రాజకీయ ప్రయోజనాల కోసం తన ఫ్యామిలీని ఉపయోగించుకోరని తెలుస్తుంది.



























