Ramcharan: ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. ఉపాసన రాంచరణ్ ల వివాహం 11 సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా వీరి వివాహం జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఈ జంట పిల్లల గురించి ఆలోచించలేదు.

ఇటీవల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఉపాసన రాంచరణ్ కుమార్తె క్లిన్ కారా ఆరు నెలలను పూర్తి చేసుకున్నారు. ఇలా తమ చిన్నారికి ఆరు నెలలు పూర్తి అయినప్పటికీ ఇప్పటివరకు తాను ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం అభిమానులకు చూపించలేదు దీంతో అభిమానులు మెగా వారసురాలని ఎప్పుడు చూస్తామా అన్న ఆత్రుత కనబరుస్తున్నారు.
ఇకపోతే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మేక కుటుంబంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా తన కుమార్తెకు కూడా ఎరుపు రంగు డ్రెస్ వేసి శాంటా క్లాస్ లాగా తయారు చేశారు.
బెస్ట్ డాడ్…
తన కూతుర్ని ఎత్తుకొని రాంచరణ్ తనని ముద్దాడుతూ ఉండగా పక్కనే ఉన్నటువంటి ఉపాసన తండ్రి కూతురు మధ్య అనుబంధం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బెస్ట్ డాడ్ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు ఇలా రాంచరణ్ తన కూతురితో ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ పాప ఫేస్ చూపించకపోవడంతో చిన్న పాటి నిరుత్సాహం కూడా వ్యక్తం చేస్తున్నారు.




























