Upasana: ఇండస్ట్రీలో మెగా హీరో రామ్ చరణ్,ఉపాసన దంపతులకు ఎంతో మంచి క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్నారు. ఇలా ఈ ఇద్దరు సెలబ్రిటీలకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎంతోమందికి ఆరోగ్యానికి సంబంధించిన విలువైన సూత్రాలను చెబుతూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉన్నటువంటి ఉపాసన కొన్నిసార్లు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇలా తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఉపాసన తాజాగా ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు అయితే ఇందులో రామ్ చరణ్ పై ఈమె రివెంజ్ తీర్చుకుంటున్నట్లు ఉంది.
నేటిజన్స్ రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించిన రెండు వీడియోలను కలిపి ఒక వీడియోగా క్రియేట్ చేశారు అయితే ఈ వీడియోని సరదాగా తీసుకున్నటువంటి ఉపాసన ఆ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే గత కొన్ని నెలల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలలో భాగంగా మెగా ఫ్యామిలీ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

Upasana: అబ్బాయిల ఫన్ అమ్మాయిల కౌంటర్
ఈ వేడుకలలో భాగంగా రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ ఉపాసన ముగ్గురు ఒకే సోఫాలో కూర్చున్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసనని పక్కకు పంపించడంతో సాయిధరమ్ తేజ్ రామ్ చరణ్ ఇద్దరూ నవ్వుకున్నారు. అయితే ఈ వీడియోకి గతంలో కరోనా సమయంలో రామ్ చరణ్ ఓ ఛాలెంజ్ చేస్తూ తన భార్య ఉపాసనకు సపర్యలు చేసిన వీడియోని కలిపి ఒక వీడియోగా క్రియేట్ చేశారు. ఈ వీడియోకి అబ్బాయిల ఫన్ అమ్మాయిల కౌంటర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇలా ఈ వీడియో చూసినటువంటి అభిమానులు ఉపాసన రాంచరణ్ పై రివెంజ్ తీర్చుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
































