కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ తో పాటు పలు స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త స్కీమ్ లను అమలు చేయడం ద్వారా కేంద్రం రైతులకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. అయితే కేంద్రం రైతుల కోసం మరో కొత్త స్కీమ్ ను అమలులోకి తీసుకురానుందని రాబోయే బడ్జెట్ లో ఈ స్కీమ్ ను తీసుకువచ్చే యోచన చేస్తోందని తెలుస్తోంది.

కేంద్రం ఈ కొత్త స్కీమ్ ద్వారా రైతుల ఖాతాలలో నేరుగా నగదును జమ చేయనుందని తెలుస్తోంది. ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ మంత్రత్వ శాఖ ద్వారా కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేయనుందని సమాచారం. కేంద్రం ఇకపై యూరియాను కొనుగోలు చేసే రైతులకు సబ్సిడీని ఖాతాలలో జమ చేయనుందని తెలుస్తోంది. ఫర్టిలైజర్ కంపెనీలకు యూరియా సబ్సిడీని ఇవ్వకుండా రైతులకు ఇస్తే మంచిదని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం కేంద్రం గ్యాస్ సిలిండర్ కొనుగోలుపై గ్యాస్ వినియోగదారుల ఖాతాలో సబ్సిడీని జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రైతుల ఖాతాలలో కూడా యూరియా సబ్సిడీని జమ చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిజంగా యూరియా సబ్సిడీ రైతుల ఖాతాలలో జమవుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టేంత వరకు ఆగాల్సిందే.
ఫర్టిలైజర్ కంపెనీలకు సబ్సిడీని ఇవ్వడం వల్ల అధిక భారం పడుతుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఈ స్కీమ్ ను ప్రవేశపెడితే మాత్రం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ మంత్రత్వ శాఖ సూచనల మేరకు 80 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈ స్కీమ్ లో భాగంగా అమలు చేయనుందని తెలుస్తోంది.

































