కోవిడ్ నేపథ్యంలో కొంతమందికి కొలువులు ఊడగా.. మరికొంతమందికి కొత్త కొలువులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పిస్తూ.. ఐటీ రంగానికి చెందిన పలు కంపెనీలు నిలబడ్డాయి. ఆర్థిక సేవలు, ఇతర రంగాల్లో డిజిటలీకరణ శరవేగంగా జరగడం ఐటీ కంపెనీలకు వరంగా మారింది.

ప్రాజెక్టులు అధికంగా రావడంతో దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. తాజాగా అమెజాన్, విప్రో, క్యాప్‌జెమినీ వంటి దిగ్గజ సంస్థలు భారీగా నియామకాలకు సిద్ధమయ్యాయి. దీనిలో అమెజాన్ సంస్థ దాదాపు 55 వేల ఉద్యోగాలను నియమించుకునేందుకు సన్నాహాలు చేపడుతుంది. ఇది ఫేస్ బుక్ ఉద్యోగులకు సమానం కాగా.. గూగుల్ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య దాదాపు మూడో వంతు కంటే ఎక్కువగా ఉంది.
బీ టెక్ చేసిన వారికి ‘ఎలైట్ నేషనల్ ట్యాలెంట్ హంట్’తో ఈ అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. విప్రోలో ఎంపికైన వారికి రూ.3- 3.8 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ ఇవ్వనుంది. 2022లో ఉత్తీర్ణులు అయ్యేవారు ఇందుకు అర్హులుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదే బాటలో క్యాప్ జెమినీ సంస్థ కూడా క్యాంపస్ డ్రైవ్ 2021 నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దానికి ఎంసీఏ, ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఇదే బాటలో అప్పిన్‌వెంటివ్ సంస్థ కూడా 500 మంది ఫ్రెషర్స్ ను తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ ఈ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ అప్పిన్‌వెంటి లో 700 మంది ఉద్యోగులు ఉన్నారు.































