Telugu Indian Idol Winner: తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమౌతున్నటువంటి తెలుగు ఇండియన్ ఐడల్ సూపర్ సింగర్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. 12మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు ఐదు మంది కంటెస్టెంట్ లు ఎంపికయ్యారు.ఇకపోతే ఈ ఐదుగురిలో పోటాపోటీగా సాగిన ఈ కార్యక్రమంలో చివరికి సింగర్ వాగ్దేవి విజేతగా నిలబడ్డారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ నెల 17వ తేదీ ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు విరాటపర్వం చిత్రబృందం కూడా వేదికపై సందడి చేసినట్లు తెలుస్తోంది. మొట్టమొదటిసారి తెలుగు ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరై చిరంజీవి చేతుల మీదుగా విజేతకు ట్రోఫీ అందజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విజేతగా వాగ్దేవిని ప్రకటించడంతో ఆమె ఎంతో సంతోషపడుతూ తనకు ఎప్పటికైనా ఏ ఆర్ రెహమాన్ దగ్గర పాట పాడాలని అలాగే ఇళయరాజా గారి దగ్గర కోరస్ అయినా ఇవ్వాలనే తన కోరిక అంటూ తెలిపారు.
ఈ విజయం తల్లికి అంకితం…
ఇక తన తల్లికి నన్ను సింగర్ చూడడమే తన కోరిక అని ఈ విజయాన్ని తన తల్లికి అంకితం చేస్తున్నా అంటూ తెలిపారు. అదే విధంగా నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక వాగ్దేవి తండ్రి ఈ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మా అమ్మాయి ఇటువంటి అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు.
































