Vaishnavi Chaitanya: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని వివిధ రంగాలలో స్థిరపడిన వారు ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు అందం అభినయం కూడా ఉండాల్సిందే.అయితే సినీ బ్యాగ్రౌండ్ లేనటువంటి వారు ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

ఈ విధంగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి సోషల్ మీడియాని ఉపయోగించుకొని తన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెండితెర హీరోయిన్ గా అవకాశాలు అందుకొని ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఇలా 1994 జనవరి 4వ తేదీ ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వైష్ణవి చైతన్య సోషల్ మీడియాను ఉపయోగించుకొని డబ్ స్మాష్ వీడియోలను చేస్తూ పాపులర్ అయ్యారు.అలాగే ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని ఈమె మెల్లిమెల్లిగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఈమె నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ షార్ట్ ఫిలిం ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది అనంతరం ఈమె వలిమై, వరుడు కావలెను వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.

హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న వైష్ణవి చైతన్య..
ఇలా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన వైష్ణవి చైతన్య ప్రస్తుతం హీరోయిన్ గా బేబీ అనే సినిమాలో అవకాశం అందుకున్నారు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ తనకు అనుగుణంగా మార్చుకొని ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలా హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నటువంటి వైష్ణవి చైతన్య ముందు ముందు ఇంకా ఎలాంటి విజయాలను అందుకుంటాదో తెలియాల్సి ఉంది.

































