Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య యూట్యూబర్ గాను, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. తాజాగా ఈమె నటించిన బేబీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వీరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇలా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతూ ఇక్కడ కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆహాలో ప్రసారమవుతున్నటువంటి నేపథ్యంలో ఆహా ఓటీటీ ‘వాట్సాప్ బేబీ’ పేరుతో వైష్ణవి చైతన్య వీడియోను పంచుకుంది.
ఇందులో భాగంగా నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్యను నేటిజన్స్ ప్రశ్నిస్తూ మీకు కనుక వీరాజ్ అశ్విన్ లేదా ఆనంద్ దేవరకొండ వీరిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెబితే ఎవరిని చేసుకుంటారంటూ ఈమెకు ఒక్క ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు వైష్ణవి చైతన్య సమాధానం చెబుతూ తాను ఇద్దరినీ పెళ్లి చేసుకోనని తెలిపారు.

Vaishnavi Chaitanya: ఇద్దరినీ పెళ్లి చేసుకోను….
ఇక వీరిద్దరిలోను కొన్ని క్వాలిటీస్ నాకు చాలా బాగా నచ్చుతాయని ఈమె తెలియజేశారు. బేబీ సినిమాలో వైష్ణవి చేసినది కరెక్టేనా అంటూ మరొక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. మనం నటించే సమయంలో ఇలాగే ఉండాలి అని పరిమితులు పెట్టుకుంటే సరిపోదని కథ పాత్ర ఆధారంగా ఆ క్షణం మనం మనల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ వైష్ణవి చైతన్య చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.