Vaishnavi Chaitanya: వామ్మో ఒక్క సినిమా సక్సెస్ కే ఇన్ని కండిషన్ల… బేబీ హీరోయిన్ కండిషన్స్ మామూలుగా లేవుగా?

0
37

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య పరిచయం అవసరం లేని పేరు ఎన్నో వెబ్ సిరీస్లలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా బేబీ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు పొందిన వైష్ణవి చైతన్య పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.

ఈ విధంగా వైష్ణవి చైతన్య నటించిన బేబీ సినిమా ఏకంగా 80 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టడంతో ఈమెకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీలో వైష్ణవి చైతన్య బిజీ హీరోయిన్గా మారబోతున్నారు. ఇలా వరుస అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె మాత్రం ఈ సినిమాలకు కమిట్ అవ్వాలి అంటే దర్శక నిర్మాతలకు భారీగా కండిషన్స్ పెడుతున్నట్టు తెలుస్తుంది.

ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విషయాన్ని అందుకున్నటువంటి బేబీ సినిమా తర్వాత ఎంతోమంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు వైష్ణవి చైతన్యను సంప్రదిస్తున్నారు. అయితే ఆ సినిమాలకు ఈమె కమిట్ అవ్వాలంటే తనకు ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అదేవిధంగా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతే తాను అగ్రిమెంట్ పై సంతకం చేస్తాను అంటూ కండిషన్స్ పెడుతున్నారు.

Vaishnavi Chaitanya: సినిమాకు ఏకంగా రెండు కోట్ల..


ఈ విధంగా ఒక సినిమా సక్సెస్ కావడంతో రెండో సినిమాకి ఈమె దర్శక నిర్మాతలకు ఇలాంటి కండిషన్స్ పెట్టడంతో పలువురు ఈమె వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి కండిషన్స్ పెడుతూ కాస్త ఓవర్ చేస్తే కెరియర్ పైన దెబ్బ పడుతుందని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నేపథ్యంలో అవకాశాలు వచ్చినప్పుడే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ హీరోయిన్గా కొనసాగాలని వైష్ణవి చైతన్య భావించినట్టు ఉన్నారేమో అందుకే ఇలా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.