Valtair Veerayya: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా గాడ్ ఫాదర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఇకపోతే తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా గురించి ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సినిమాలో శృతిహాసన్ చిరంజీవి ఉన్నటువంటి ఫోటో గురించి ఈయన స్పందిస్తూ చిరంజీవి ఇకపై రొమాంటిక్ పాత్రలలో కాకుండా సీరియస్ రోల్స్ చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు.
చిరంజీవిని ఇలాంటి రొమాంటిక్ పాత్రలలో చూసి బోర్ కొడుతుందని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అదే విధంగా వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి ఖాతాలో మరొక డిజాస్టర్ చేరనుందని ఆయన తన రివ్యూ ఇచ్చారు. ఇలా ఈ సినిమా గురించి ఉమైర్ సందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మేగా ఫాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Valtair Veerayya: పబ్లిసిటీ కోసమే చిరు సినిమాపై విమర్శలు…
ఈ సందర్భంగా మెగా ఫాన్స్ ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక సినిమా విడుదల కాకుండానే ఆ సినిమా గురించి ఇలాంటి నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం భావ్యం కాదని వార్నింగ్ ఇస్తున్నారు. ఈయన పబ్లిసిటీ కోసమే చిరంజీవి సినిమా పై ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు.మరి సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డితో పోటీపడుతున్న వాల్తేరు వీరయ్య ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

































