టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి..తన కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలు చేసిన వంశీ.. ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయ్యాడు.. ఇక 2019లో మహర్షి సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వంశీ పైడిపల్లి… ఇంత వరకు మరో సినిమా చేయలేదు..ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా డైరెక్టర్ గా వంశీ కి మంచి పేరు తీసుకొచ్చింది..

ఇక మహర్షి ప్రమోషన్‌ టైంలోనే మహేష్ బాబుతో నెక్ట్స్ సినిమా అన్న ఎనౌన్స్‌మెంట్ వచ్చినా…. ఆ ప్రాజెక్ట్ కూడా కాన్సిల్ అయ్యింది. తాజాగా వంశీతో సినిమా అంటూ ఇద్దరు టాప్ హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి.కోలీవుడ్ టాప్ స్టార్‌ విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్‌ గత వారం రోజులుగా తెగ వైరల్ అవుతోంది. ప్రజెంట్ నెల్సన్ దిలీప్‌ తో సినిమా చేస్తున్న విజయ్‌.. నెక్ట్స్ వంశీ పైడిపల్లితో మల్టీ లింగ్యువల్ మూవీకి ప్లాన్ చేస్తున్నారన్నది నిన్న మొన్నటి వరకు వినిపించిన అప్‌డేట్‌..

ఇప్పుడు ఈ న్యూస్‌కు కొనసాగింపుగా మరో న్యూస్ వైరల్ అవుతోంది.పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుందట. ఈ న్యూస్‌ కొత్త డిస్కషన్ మొదలైంది. తమిళ్‌లో విజయ్‌కు ఎలాంటి ఇమేజ్‌, ఫాలోయింగ్ ఉందో.. తెలుగులో పవన్‌కు కూడా సేమ్ ఇమేజ్‌, ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఒకే సినిమాను ప్యారలల్‌గా ఇద్దరు హీరోలతో రెండు భాషల్లో చేస్తున్నారా అన్న డౌట్స్ రెయిజ్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

మరో వైపు ఇద్దరు స్టార్ హీరోలు… ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉంది… ఒకే కథను రెండు చోట్ల అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించాలి. మరి వంశీ ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనేదే ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇద్దరు టాప్ హీరోల్లో ముందుగా తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసునున్నాడట వంశీ పైడిపల్లి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here