అలనాటి తారలు మంజుల – విజయ్ పెద్ద కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి వనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎప్పుడు తన పెళ్లి, ప్రేమ, విడాకులంటూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇప్పటివరకు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచిన నటి వనిత తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే ఆమె పై వచ్చే కామెంట్లకు తీవ్రస్థాయిలో స్పందిస్తూ పెద్ద వివాదానికి తెర లేపుతూ ఉంటాయి.

నటి వనిత మూడవసారి పీటర్ పాల్ ను క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పీటర్ తన మొదటి భార్య ఎలిజబెత్ కు విడాకులు ఇవ్వకుండా ఈమెను పెళ్లి చేసుకోవడంతో వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది నటీనటులు సైతం వనితను టార్గెట్ చేసి ఎలిజబెత్ కు సపోర్ట్ చేశారు.

పీటర్ తో కలిసి పుట్టినరోజు వేడుకలకు గోవా వెళ్లిన ఈమె అక్కడ తన పద్ధతి నచ్చకపోవడంతో వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై నటి వనిత స్పందిస్తూ అతని నుంచి నేను వేరుగా ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను.. అందరికీ అందుబాటులో ఉంటాను అంటూ కన్ను కొడుతూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నటి వనిత షేర్ చేసిన ఈ ఫోటో చూసిన ఓ నెటిజెన్ కు బాగా కాలడంతో ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. సింగిల్ గా ఉన్నాను అంటూనే అందుబాటులో ఉన్నా అనడం ఏమైనా సవ్యంగా ఉందా? నీకు అసలు బాధ్యతలు లేవా? మీకు ఎదిగిన పిల్లలు ఉన్నారంటూ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలోనే సదరు నెటిజన్ చేసిన కామెంట్లపై నటి వనిత స్పందిస్తూ… ఎలా ఉండాలో మాకు తెలుసు… నీ బతుకేదో నువ్వు బతుకు.. నాకు అవసరం ఉంటే నువ్వు వచ్చి ఏం పెట్టలేదు కదా? నీకు ఇష్టమైతే నా వీడియోలు చూడు లేకపోతే లేదు అంటూ వనిత ఘాటుగా స్పందించడంతో ప్రస్తుతం ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here