బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు భారీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది. గత ఎపిసోడ్ లో మోనిత ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన ఆనందరావు గుండెపోటుతో ఆసుపత్రి పాలవుతాడు. ఈ క్రమంలోనే దీప ఈపెళ్లి జరగదని ఖరాఖండిగా మోనితకి వార్నింగ్ ఇస్తుంది.

దీప వార్నింగ్ ఇవ్వడంతో మోనిత విషం కలిపిన నీళ్లను బాటిల్ లోకి తీసుకుని దీప ఇంటికి వెళ్లి బెదిరిస్తుంది. మోనిత ఇలా బెదిరించడంతో అందరూ ఎంతో షాక్ అవుతారు. కానీ దీప మాత్రం తాగవే.. ఈ నీళ్లు తాగు అంటూ బెదిరిస్తుంది. మోనిత కంగారు పడటంతో ఆ బాటిల్ లోని నీటిని దీప తాగుతుంది. ఈ క్రమంలోనే దీప విషం కలిపిన నీళ్లు తాగటంతో అభిమానులు ఆ తర్వాత ఏం జరుగుతుందో అని తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ అవి నిజంగానే విషం కలిపిన నీళ్లు అయితే వంటలక్క చనిపోతుందా… దీప చనిపోతే కార్తీక్, మోనితల పెళ్లి జరుగుతుందా.. ఏంటి ఈ ట్విస్ట్ మాకు అంటూ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. నిజంగానే దీప చనిపోతుందా..?కార్తీక్,మోనిత పెళ్లి జరుగుతుందా..? అనే విషయం తెలియాలంటే మనం సోమవారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.



























