బుల్లితెరపై హీరోయిన్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని దూసుకుపోతున్న సీరియల్ నటి ఎవరైనా ఉన్నారా అంటే అందరూ వెంటనే కార్తీకదీపం దీప అలియాస్ వంటలక్క పేరు చెబుతారు. కార్తీకదీపం సీరియల్ లో దీప పాత్రలో నటిస్తున్నటువంటి ప్రేమి విశ్వనాథ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు హీరోయిన్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

బుల్లితెరపై తన నటనా తీరుతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ వంటలక్కకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందని చెప్పవచ్చు. బుల్లితెర పై ఏర్పడిన క్రేజ్ ద్వారా ఏకంగా వెండితెరపై సందడి చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు పలు సినిమాలలో నటించే అవకాశాలు క్యూ కట్టాయి.

నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించడం కోసం వంటలక్కను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో నటించడం కోసం దీప కరెక్టుగా సరిపోతుందని భావించిన చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపారు. అయితే ఈ సినిమాలో నటించడం కోసం దీప ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
ఇస్మార్ట్ శంకర్,రెడ్ వంటి మాస్ యాక్షన్ చిత్రాల ద్వారా ఫుల్ జోష్ లో ఉన్నటువంటి ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించడం కోసం ఈమెకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే చిత్రబృందం ఈమెతో సంప్రదింపులు జరుపగా అందుకు ఈమె ఒప్పుకున్నారని వార్తలు వినబడుతున్నాయి. మరి వంటలక్క వెండితెరపై ఏ విధంగా ప్రేక్షకులను సందడి చేస్తారో వేచిచూడాల్సిందే.



























