కార్తీకదీపం సీరియల్ ఈ రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠతను నెలకొల్పుతుంది.ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆనందరావు కు కార్తీక్ ట్రీట్మెంట్ చేయగా తనతో ట్రీట్మెంట్ చేయించుకోని కార్తీక్ మోహన్ చూడటానికి ఇష్ట పడక పోవటంతో కార్తీక్ బదులు డాక్టర్ గోవర్ధన్ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే ఈ రోజు కార్తీక దీపం1100 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం…

ఆస్పత్రి బయట ఆదిత్య, కార్తీక్, దీప దిగాలుగా ఉంటారు. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ఏమైంది కార్తీక్? అంకుల్ ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతారు. అంకుల్ కు వెంటనే యాంజియో గ్రామ్ చేయాలి.. స్టంట్ కూడా పడొచ్చు అంటాడు. అప్పుడు కార్తీక్ ఫార్మాలిటీస్ పూర్తి చేయని చెప్పడంతో ఆదిత్య డాక్టర్ వెంట వెళ్తాడు. ఇక తండ్రి అన్న మాటలను గుర్తు చేసుకుని కార్తీక్ ఎంతో కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు దీప ఏమైంది డాక్టర్ బాబు అలా ఉన్నారు అని అడగగా… పాముతో స్నేహం చేస్తే నేను కూడా ఆ పుట్టలో పుట్టిన వాడినా.. నేను మోనితతో చేసిన స్నేహం నన్ను ఎలాంటి పరిస్థితికి తీసుకు వచ్చింది చూడు. ఈ రోజు నా తల్లిదండ్రులు అసహ్యించుకున్నారు. రేపు సమాజం వెళ్లి వేస్తుంది అంటూ దీప భుజంపై తలవాల్చి బాధపడతాడు.
ఎందుకు డాక్టర్ బాబు మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు? న్యాయం మీ వైపు ఉంది.. నేను మీ వైపే ఉన్నాను అంటూ దీప కార్తీక్ కు భరోసా ఇస్తుంది. అలా బయటకి వెళ్దాం పదండి డాక్టర్ బాబు అని కార్తీక్ ని బయటకు తీసుకువెళ్తుండగా దీపా అడ్డుపడి కార్తీక్ బయటకి వెళ్దాం అంటుంది. నేను నీతో రాను.. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు చేసిందంతా చేసి అంటాడు కార్తీక్. మామయ్యకు హార్ట్ ఎటాక్ వస్తే నా తప్పేముంది? అసలు నీకు ఏం సంబంధమని కార్తీక్ ప్రశ్నించగా.. అలా అంటావేంటి కార్తీక్.. నీ పిల్లలను దీప కడుపులో మోసింది. నేను మోస్తున్నాను.. మా ఇద్దరికీ ఏం తేడా ఉంది? ఒక తాళి మాత్రమే తక్కువ.. 25వ తేదీ ఆ తాళి కూడా పడిపోతే మేమిద్దరం నీకు భార్యలు.. ఇందులో తప్పేముంది అని ప్రశ్నిస్తుంది.
ఇంతలో దీప కల్పించుకొని మరీ ఏం మొహం పెట్టుకుని వచ్చావే ఇక్కడికి మామయ్య ప్రాణాలను రిస్క్ లో పెడదామన అనడంతో అదేంటి దీప అలా అంటావు తన ఇద్దరికీ మామయ్య కదా… దీప ఏదో చెప్పబోతుంటే రా కార్తీక్ అర గంటపని ఉందంటూ కార్తీక్ చెయ్యి పట్టుకుంటుంది. అప్పుడు దీప వెళ్ళండి డాక్టర్ బాబు 25 వ తేదీ పెళ్లి కదా పెళ్లి పనులు చూసుకోవాలి కదా నేను కూడా వెళ్లి ఈ పెళ్లిని ఎలా పెటాకులు చేయాలో చూసుకుని వస్తాను. ఈ సమయంలో అంజి ఉంటే బాగుండు అని అనడంతో మోనిత షాక్ అవుతుంది. ఏంటి దీని దైర్యం అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
దీప ఇంట్లో భాగ్యం కార్తీక్ అందరూ కూర్చొని ఉండగా అక్కడకు మోనిత విషం కలిపిన నీళ్లను బాటిల్ లో తీసుకొని వెళుతుంది. దీప ఇంటికి వెళ్లి అందరినీ బెదిరించడంతో భాగ్యం తనను కొట్టడానికి వెళుతుంది.నాకు తెలుసు నువ్వు కొట్టడానికి వస్తావని అందుకే ఇందులో విషం కలిపిన నీరు తీసుకు వచ్చాను అని చూపిస్తుంది. నువ్వు నన్ను కొట్టడానికి వస్తే… నేను ఈ విషయం నీళ్లు తాగుతా అంటూ.. బెదిరించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీంతో దీప తాగనీవ్వండి డాక్టర్ బాబు.. తాగితే దీని ప్రాణాలే కదా పోయేది… ఈ నీళ్లు తాగితే నువ్వెలా చస్తావు చూస్తానంటూ బాటిల్ మోనిత దగ్గరకు జరుపుతూ వెళుతుంది.మోనిత బాటిల్ ముట్టుకోకపోయేసరికి పోనీ నేను తాగన అంటూ బాటిల్ మూత తీసి దీప విషం కలిపిన నీళ్లను తాగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? కథ ఎక్కడికి దారి తీస్తుంది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.































