Varalakshmi Sarath Kumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ఈమె హీరోయిన్ గా కాకుండా విలన్ పాత్రలలో నటిస్తే ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈమె హనుమాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు ఈమె హనుమన్ సినిమాలో అంజమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ఈమెకు సలార్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో సలార్ సినిమాలో శ్రియా రెడ్డి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించాల్సి ఉండేది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఈమెను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వరలక్ష్మి శరత్ కుమార్ సమాధానం చెబుతూ నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అలాంటిది ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వస్తే నేనెందుకు వదులుకుంటాను అంటూ సమాధానం చెప్పారు. ఈమె చెప్పిన సమాధానం చూస్తుంటే ఈమెకు అసలు అవకాశమే రాలేదని, మేకర్స్ తనని సంప్రదించలేదని తెలుస్తుంది.
ప్రభాస్ అంటే చాలా ఇష్టం…
జనవరి 12వ తేదీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా నటించినటువంటి హనుమాన్ సినిమా విడుదలవుతుంది ఈ సినిమాలో ఈయన హీరోకి అక్క పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా వైద్య భరితంగా ఉంటుంది అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































