Varalakshmi: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వరలక్ష్మి ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె తన స్నేహితుడి నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ తర్వాత వీరికి సంబంధించిన ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక వీరి వివాహం థాయిలాండ్ లో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక వీరి సంగీత్, హల్దీ మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రం ఎక్కడ షేర్ చేయలేదు.

అయితే తాజాగా వరలక్ష్మి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో భాగంగా వీరిద్దరూ సాంప్రదాయమైన దుస్తులను ధరించి హిందూ సంప్రదాయాల ప్రకారమే వివాహం జరుపుకున్నారని తెలుస్తోంది. నికోలయ్ పట్టు వస్త్రాలను ధరించి ఉండగా వరలక్ష్మీ సైతం ఎరుపు రంగు పట్టుచీరను ధరించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉన్నారు.
సాంప్రదాయబద్ధంగా…
ఇక ఈ పెళ్లి వేడుకలలో రాధికా శరత్ కుమార్ కూడా ఎంత సంతోషంగా కనిపించారు. ఇలా సాంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగిందని ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా థాయిలాండ్ లో పెళ్లి చేసుకున్న వీరిద్దరు చెన్నైలో ఎంతో ఘనంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు తెలిసినదే .ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.



























