Vardhan Puri: సాధారణంగా మహిళలు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పొందాలంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవకాశాల కోసం వెళ్లిన మహిళల పట్ల సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవకాశాలు ఇస్తామని చెప్పి వారి మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

కొంతమంది అవకాశాల కోసం ఇలాంటి వాటిని అంగీకరిస్తూ ముందుకు వెళుతుంటే మరి కొంతమంది మాత్రం ఇలా దారుణాలకు పాల్పడుతున్న వారి గుట్టు రట్టు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమ్రేష్ పురి మనవడైన వర్ధన్ పురి కూడా కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమ్రేష్ పురి మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్ధన్ పురి “యే
సాలి ఆషిఖి” అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా ద్వారా అతనికి సరైన గుర్తింపు లభించలేదు.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వర్ధన్ పురిని కొంతమంది అవకాశాల పేరుతో మోసం చేయటానికి ప్రయత్నించినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ధన్ పురి ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటర్వ్యూలో వర్ధన్ పురి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాత్రమే కాకుండా మగవాళ్ళు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Vardhan Puri: కోరికలు తీర్చమని బలవంతం చేశారు…
అంతేకాకుండా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడునని వెల్లడించాడు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తనని కొంతమంది అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వారి కోరికలు తీర్చమని బలవంతం చేసినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా మరికొంతమంది సినిమాలలో అవకాశాల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా వెల్లడించాడు. ఇలా చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అతన్ని మోసం చేయటానికి ప్రయత్నించినట్లు వెల్లడించాడు. అయితే కాస్టింగ్ కౌచ్ గురించి వర్ధన్ చేసిన వ్యాఖ్యలు బి టౌన్ లో వైరల్ అవుతున్నాయి.































