Konda – Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ పేరు తెలియని వారుండరు. కాంట్రవర్సీలు ఎక్కడ ఉంటే అక్కడే ఇతడు ఉంటాడు. కాంట్రవర్సీలను కావాలనే స్పష్టించుకుంటాడు. వర్మ చేసే పోస్ట్స్, వీడియోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. మొట్టమొదటిసారిగా టాలీవుడ్ కు నాగార్జున హీరోగా శివ సినిమా తీసి.. మంచి విజయం సాధించాడు.

ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో రిమేక్ చేసి.. అక్కడ కూడా పరిచయం అయ్యాడు. ఇలా తెలుగు హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్జీవీ పలు వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులు ఆశ్చర్య పోయేలా చేస్తున్నారు.

నిజ జీవిత కథలతో రక్త చరిత్ర, వీరప్పన్, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి మూవీస్ తెరకెక్కించిన ఆర్ జివి ఇప్పుడు రాజకీయ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా “కొండా”మూవీని తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఈ సినిమా షూటింగ్ వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం వచనగిరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
సినిమాను అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించారు:
ఈ సినిమాను అడ్డుకునేందుకు ఎందరో ప్రయత్నించారు. దీనిలో భాగంగానే మధ్యలో ఒకటి రెండు సార్లు షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. చివరకు ఈ సినిమా షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. హనుమకొండలో ఆఖరి షెడ్యుల్ పూర్తైన తర్వాత చిత్రయూనిట్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి కొండ దంపతులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గా కనిపించి సందడి చేశారు. నక్సలైట్ గెటప్‌లో ఉండి..తల్వార్ చేతపట్టి కేక్‍ను నరికేస్తూ హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.





























