ఎక్స్‌ట్రా జబర్దస్త్, జబర్దస్త్ లకు ప్రేక్షకుల నుంచి ఎంత మంచి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో జోడీల వ్యవహారం గురంచి మొదటి నుంచి వింటూనే ఉన్నాం. జోడీలుగా చూపిస్తూ.. వారి మధ్య కెమెస్ట్రీని పండించడంలో ఈ షో లు పాపులర్ అయ్యాయి. అందులో మొదట చెప్పుకునే జంటల్లో రష్మీ- సుధీర్. తర్వాత వర్ష- ఇమ్మానుయేల్ జోడీ ఉంటుంది.

వీరిద్దరి రొమాంటిక్ కామెడీ స్కిట్స్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. బయట సోషల్ మీడియాలో కూడా ఈ జంట అప్డేట్స్ తో రచ్చ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించేసినా మళ్ళీ దాన్నే ఫోకస్ చేస్తూ వాళ్ళిద్దరి గుట్టు రట్టు చేసింది జబర్దస్త్ జడ్జ్ రోజా. అసలేమైందంటే.. తాజాగా విడుదలైన ప్రోమోలో మీరిద్దరు రెండ్రోజుల క్రితం ఎక్కడకు వెళ్లారు అంటూ అడుగుతుంది.
వాళ్లు దానికి సమాధానంగా ఆ రోజు తాను షూటింగ్‌లో ఉన్నాను..ఇమాన్యుయేల్ వేరే చోట ఉన్నాడు అని వర్ష చెప్తుంది. అవునా.. మరి ఈ ఫొటో ఏంటి అంటూ.. ఇద్దరు కారులో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నా ఫొటోను చూపిస్తూ.. కారులో షికార్లు కొడుతూ.. అబద్దాలు చెబుతారా అంటూ రోజా సరదాగా అంటుంది. అది చూసిన వర్ష ఇమ్మానుయేల్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
ఇక ఆ ఫొటోపై వర్ష రియాక్ట్ అవుతూ ఇలా చెబుతుంది. ఆ రోజు షూట్ లో నాకు బాలేదని ఇమాన్యుయేల్‌కు ఫోన్ చేస్తే.. నా గొంతు విని దాంట్లోనే నా మూడ్ బాలేదని అర్థం చేసుకుని నేనున్న చోటుకి ఇమ్మానుయేల్ వచ్చేశాడని చెప్పుకొచ్చింది వర్ష. ఇక ఈ ఫన్నీ సన్నివేశాలతో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని రోజుల వరకు వీళ్లద్దిరి మద్య కెమస్ట్రీని చూపించని మల్లెమాల మళ్లీ.. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ పై ఫోకస్ పెంచేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
































