Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే .ఈ సినిమా మార్చి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో మెల్లమెల్లగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా మార్చ్ 1వ తేదీ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను మల్లారెడ్డి కాలేజీలో విడుదల చేసి అనంతరం కాలేజీ విద్యార్థులతో చిత్ర బృందం ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ మీట్ లో భాగంగా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కొంతమంది స్టూడెంట్స్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వరుణ్ సమాధానం చెబుతూ నా ఫేవరెట్ హీరోయిన్ ను నేను పెళ్లి చేసుకున్నాను ఆమె ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంది అంటూ సమాధానం చెప్పారు.
సాయి పల్లవి…
మీ వైఫ్ కాకుండా మీకు మరే హీరోయిన్ అంటే ఇష్టం అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు తన సెకండ్ ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి అంటూ చెప్పుకోవచ్చారు. ఇక బాబాయ్ తో సినిమా ఎప్పుడు చేయబోతున్నారనే ప్రశ్న కూడా ఎదురయింది. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ సమాధానం చెప్పారు.































