Varun Tej & Lavanya Tripati : ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్ లో ఉండటం వంటివన్నీ కామన్. అయితే ప్రేమ, లివింగ్ టుగెదర్ వరకు ఉంటారు కానీ పెళ్లి పెట్టాలెక్కేది కొంతమందే. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రేమ జంట త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారు. మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి నటుడుగా గుర్తింపు అందుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎప్పటినుండో వీరి మధ్య రిలేషన్ ఉందని వినిపిస్తున్నా ఇంతవరకు ఈ జంట కన్ఫర్మ్ చేయలేదు. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో ఎంగేజ్మెంట్… పెళ్లేప్పుడంటే…
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో నటించారు. ఆ సినిమాలో పెద్దగా హిట్ కాకపోయినా వీరి లవ్ స్టోరీ మాత్రం బాగా హిట్ అయింది. పెద్దలను ఒప్పించుకుని ఇద్దరూ తాజాగా ఒక్కటి కాబోతున్నారు. జూన్ 9 తేదీన ఎంగేజ్మెంట్ జరగనుందని సమాచారం.

అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ఆరోజు ఎంగేజ్మెంట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక పెళ్లి కూడా ఈ ఏడాదిలోనే ఉంటుందంటూ చెప్పారు. నవంబర్ లో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. నాగబాబు ప్రస్తుతం ఇండియాలో లేకపోవడం వల్ల ఆయన వచ్చాక ఎంగేజ్మెంట్ గురించి అలాగే పెళ్లి గురించి వివరాలను చెబుతారని వినిపిస్తోంది.































