నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవంలో ఉన్నారు. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఇటు బాలకృష్ణ అభిమానులు బాలయ్య కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఆహాలో అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా మరింత ప్రేక్షకాదరణ పొందుతున్నారు.

బాలయ్య సర్జరీ కారణంగా కొన్ని వారాల పాటు వాయిదా పడిన ఈ కార్యక్రమం తిరిగి ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే మూడవ ఎపిసోడ్ లో భాగంగా అనిల్ రావిపూడి బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి హాజరు కాగా బాలకృష్ణ ఎన్నో విషయాలను ముచ్చటించారు. ఇక వసుంధర సినిమాకు వెళితే తనతో ఒట్టు వేయించుకొని వెళ్లలేదని బాలకృష్ణ తన భార్య గురించి వెల్లడించారు.
నేను సినిమాకు వెళితే పాటలు వచ్చినప్పుడు నిద్ర పోవడం లేదంటే సినిమా మధ్యలో బయటకు వచ్చేయడం అలవాటుగా ఉంది. అయితే తనతో సినిమాకి వెళ్ళినప్పుడు పాటలు వస్తే నిద్ర పోకూడదని సినిమా పూర్తయ్యే వరకు బయటకు రాకూడదని నాతో ఒట్టు వేయించుకుని సినిమాకు తీసుకువెళ్ళేదని బాలకృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ విధంగా బాలకృష్ణ తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మానందాన్ని ఉద్దేశించి మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా అందుకు బ్రహ్మానందం ఏఎన్నార్ అని సమాధానం చెప్పారు. ఇక బాలకృష్ణ అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేయబోతున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.




























