Veerashankar : తణుకులో పుట్టి పెరిగిన వీరశంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి కోడిరామకృష్ణ గారి కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఇక ఆయన తెలుగులో తీసిన మొదటి సినిమా ‘హలో ఐ లవ్ యూ’. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా గుడుంబా శంకర్ సినిమాను అంజన ప్రొడక్షన్స్ లో తీశారు. ఇక ఈసినిమా పరాజయం తరువాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘నమ్మ బసవ’ సినిమా తీశారు. ఇక వీరశంకర్ గారు గుడుంబా శంకర్ సమయంలో వివాదాలను అలాగే చిత్రపురి కాలనీ వివాదాన్ని గురించి స్పందించారు.

చిత్రపురిలో దొంగలు ఉన్నారు…
సినిమా కార్మికుల కోసం ఇల్లు కట్టుకోడానికి స్థలాన్ని దానం చేసారు సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డిగారు. అయితే ఆయన సదుద్దేశంతో ఇస్తే ఇప్పడు అక్కడ మాత్రం ఆర్టిస్టులు సినిమా కార్మికులు కాని వాళ్ళు స్థలాలను పొందుతున్నారనేది వాదన. ఈ విషయం పై డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున వీరశంకర్ గారు మాట్లాడారు. డైరెక్షన్ అసోసియేషన్ ను ప్రక్షాళన చేసి నకిలీ సినిమా కార్మికుల పేర్లను తొలగించడం జరిగింది, అలాగే ఇతర సంఘాలు కూడా ఆ పని చేస్తే బాగుంటుందంటూ చెప్పారు. చాలా మంది నిజమైన కార్మికులకు లబ్ది చేకూరడం లేదని నకిలీ వాళ్ళు స్థలాలను దక్కించుకుంటున్నారని దీనిపై ఎవరు మాట్లాడరని చెప్పారు. దీనిపై మా అసోసియేషన్ ఫెడరేషన్ ఇంకా కార్మిక ఫెడరేషన్స్ కలిపి ఒక అథారిటీ గా ఏర్పడి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ అలా చేయరు. కార్మికుల విషయాల్లో మేమెందుకు కలగజేసుకోవాలని సినిమా పెద్దలు అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళు లీడర్స్ ఎలా అవుతారు అంటు కామెంట్స్ చేసారు.
ప్రకాష్ రాజ్ నిరాహార దీక్ష చేయగా…

గుడుంబా శంకర్ సినిమా స్క్రిప్ట్ అంత బాగోక నేను చేయనని చెప్పినా వినకుండా పవన్ నాతో చేయించారు. ఇక దాంతో నేను స్క్రిప్ట్ చాలా వరకు గోపి అనే రైటర్ తో కలిసి మార్చాము. ఇక ఈ సినిమాలో మొదట ప్రకాష్ రాజ్ ఉండగా మార్చిన కథలో లేరు. ఆ సమయంలో వేరే సినిమా చేస్తుండటంతో ఆయన సినిమా నుండి తప్పుకుని అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశారట. ఇక ప్రకాష్ రాజ్ పై తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ విధించినప్పటి విషయాలను వీరశంకర్ మాట్లాడారు. బ్యాన్ చేసినప్పుడు ఆయన నిరాహార దీక్ష చేయగా వీరశంకర్ గారు, కృష్ణ వంశీ గారు ఆయనకు మద్దతు ఇచ్చారట. ఇక చిరంజీవి గారు నాగార్జున గారు వచ్చి దీక్ష విరమింపజేశారట. ఆ తరువాత ఇండస్ట్రీ నుండి అయనపై బ్యాన్ ఎత్తివేశారు. ఇక గుడుంబా శంకర్ సినిమా తరువాత వీర శంకర్ గారు తెలుగులో నాలుగేళ్లు సినిమా చేయలేదు. కన్నడలో అదే సమయంలో నమ్మ బసవ అనే సినిమా దర్శకత్వం చేసారు.































