Flash Back : హిందీలో ఖుద్ గార్జ్ గా వచ్చిన సినిమాను తెలుగులో 1988 లో కృష్ణం రాజుగారు ప్రాణ స్నేహితులు అనే పేరుతో మళ్ళీ తీశారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక ఆతరువాత తమిళం లో రజనీకాంత్ నటించిన అన్నామలై సినిమా కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు ప్రొడ్యూసర్ కే వి వి సత్యనారాయణ గారు.
చిరంజీవితో చేయాలనుకుని వెంకటేష్ తో తీసిన సినిమా…

అప్పటికి కే వి వి సత్యనారాయణ గారు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా సుందరకాండ సినిమా తీస్తున్నారు. ఈ గ్యాప్ లో ఆయన అన్నమలై సినిమా ను చెన్నై లో చూసి చాలా నచ్చింది, ఆ సినిమా హక్కులను కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం వల్ల బాగా డిమాండ్ ఉంది. అదికాక అప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్ ల హవా నడుస్తోంది. దీంతో చాలా మండి ఆ సినిమా కొనాలని అనుకున్నారు. ఎక్కువ ధరకే కేవివి ఆ సినిమా హక్కులను కొన్నారు. ఇక ఆ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చిరంజీవి తో ఈ సినిమా తీస్తే బాగుంటుందని కథ చిరుకి చెప్పాలని అనుకున్నారు. ఇక ప్రయాణంలో ఫ్లైట్ లో చిరు కలవడం ఈయన స్టోరీ చెప్పడం చిరు ఓకే చేయడం అన్ని జరిగిపోయాయి.
వెంకటేష్ తో కుదిరిన కొండపల్లి రాజా….

ఇక ఏ డైరెక్టర్ తో సినిమా తీయాలా అని ఆలోచిస్తూ సుందరకాండ సినిమా సెట్స్ కి రాగా వెంకటేష్ గారు అన్నమలై సినిమా రైట్స్ తీసుకున్న విషయం తెలిసి ఈ సినిమా మనం చేద్దామని చెప్పారట. ఇక కేవివి సందిగ్ధంలో పడిపోయారు. వరుసగా రెండు సినిమాలు వెంకటేష్ తోనా లేకపోతే ఎప్పటినుండో తీయాలనుకుంటున్న మెగాస్టార్ తోనా అని అలోచించి చివరకు వెంకటేష్ తో సినిమా తీయాలనీ నిర్ణయించుకున్నారు. ఇక సుందరకాండ సూపర్ హిట్ తరువాత వెంకటేష్ రవి రాజా పినిశెట్టి దర్శకత్వములో వచ్చిన సినిమానే ’కొండపల్లి రాజా ‘.

వెంకటేష్ హీరోగా, సుమన్ వెంకటేష్ స్నేహితుడిగా నటించిన ఈసినిమా లో ఈ ఇద్దరు కలిసి చేయడం తొలిసారి. అలాగే నగ్మా తో వెంకటేష్ నటించడం తొలిసారి. ఇక ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. సినిమాలోని మూడు పాటల కోసం 25 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమా కేవివి కి మంచి విజయాన్ని అందించినా వివాదాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాపై కృష్ణం రాజు గారు హక్కులపై కోర్ట్ కి వెళ్లారు. “నా ప్రాణ స్నేహితులు” సినిమాను అనుమతి లేకుండా రీమేక్ చేసారని కేసు వేశారు. దీంతో కేవివి గారికి సినిమా సక్సెస్ కి సంబంధించిన ఆనందం మిగలలేదు. పైగా జైలు కి వెళ్లే పరిస్థితి వచ్చింది.






























